బర్త్​ డే రోజే విషాదం

  • కరెంట్​షాక్​తో విద్యార్థిని మృతి 
  • సిద్దిపేట జిల్లా నాగపురిలో ఘటన

చేర్యాల, వెలుగు :  బర్త్​డే రోజే కరెంట్​షాక్ తో విద్యార్థిని మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ కావ్య(16) గురువారం ఉదయం ఇంట్లో నీటి కోసం బోర్​ఆన్​చేయడానికి వెళ్లింది. మోటార్​కు ఆనుకొని ఉన్న కరెంట్​వైరు కట్​అయి ఉంది. ప్రమాదవశాత్తూ ఆ వైరు కావ్యకు తగలడంతో కరెంట్ షాక్​తో కిందపడి పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని తెలిపారు. కావ్య స్థానిక స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్​తెలిపారు.