అడవి అందాలను చూస్తున్న టూరిస్ట్ లకు అనుకోని విధంగా ఆరుగురు అతిథులు ఎదురయ్యారు. ఇంకేముంది వారి కళ్లల్లో ఆనందంతోపాటు భయం కూడా గూడుకట్టుకుంది. వెంటనే జీప్సీకార్లపైన ఉన్న పర్యాటకులు తమ సెల్ ఫోన్ లోని కెమెరాలకు పనిచెప్పారు. ఆ అతిథులు ఎవరో కాదు..పెద్ద పులులు. దర్జాగా అడవిలోని మట్టి రోడ్డును దాటుతూ చాలా కూల్ గా ఒకరి తర్వాత మరొకటి మొత్తం ఆరు పులులు వెళ్లాయి. అవి రోడ్డును దాటుతున్న సమయంలో పర్యాటకులు కూడా చాలా ఆసక్తిగా వాటిని గమనిస్తూ ఉండిపోయారు. ఎలాంటి కేరింతలు..శబ్దాలు చేయకుండా కళ్లార్పకుండా చూస్తుండిపోయారు. ముందు భాగంలోని కారులోని కొంత మంది..వెనుక ఉన్న మరోకారులో మరికొంత మంది ఉన్నారు. ఈ రెండు కార్ల మధ్యలోని గ్యాప్ లోనే పులులు వెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
If you haven’t seen a tiger herd, here it is?
— Susanta Nanda IFS (@susantananda3) June 12, 2022
Remarkable here to note is, a tigress usually have a litter of 2 to 4 only. Five is unusual and survival of all the cubs is rare. Indicating a high density of prey animals in the habitat & little human influence on it. pic.twitter.com/x4tQFiA0z1
