స్కూటీలోకి దూరిన కట్ల పాము

  • గద్వాల టౌన్ లో ఘటన

గద్వాల, వెలుగు : పార్కు చేసిన  స్కూటీలో కట్లపాము దూరిన ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. గద్వాల టౌన్ కు చెందిన రషీద్ మంగళవారం తన స్కూటీ ని బీరెల్లి చౌరస్తాలో పార్క్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత స్కూటీని తీసి స్టార్ట్ చేయగా అందులో పాము ఉండటం గమనించాడు. దీంతో భయపడి బండిని వదిలేసి దూరంగా వెళ్లాడు. స్థానికులకు సాయంతో స్కూటీ లో నుంచి పామును బయటికు తీసి, దాని చంపేశాడు.