ఉక్రెయిన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ పై మిస్సైల్ దాడి

ఉక్రెయిన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ పై మిస్సైల్ దాడి

ఉక్రెయిన్ పై రష్యా బాంబుల దాడి కొనసాగుతోంది. ఆ దేశ రాజధాని కీవ్ నగరం బాంబు దాడులతో అట్టుడికింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడులు రెండవరోజు కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో విధ్వంసకర దృశ్యాలే కన్పిస్తున్నాయి. జనం బిక్కిబిక్కుమంటూ భయపడుతూ జీవిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఉక్రెయిన్‌లోని కైవ్‌లోని ఓ నివాస భవనం ఈరోజు తెల్లవారుజామున క్షిపణి దాడి జరిగింది. బిల్డింగ్ పై కొంత భాగం ధ్వంసమైంది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని అంతర్గత మంత్రి సలహాదారు రాయిటర్స్‌కు చెప్పారు.  ఇప్పటికే రష్యా చేస్తున్న భారీ మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ విధ్వంసంగా మారింది. ఎక్కడ చూసినా దెబ్బతిన్న భారీ భవంతులే కన్పిస్తున్నాయి.