కాలేజీ సమస్యలపై స్పీకర్ కు వినతి

గద్వాల, వెలుగు : అక్షరాస్యతలో వెనకబడ్డ గట్టు కాలేజీ సమస్యలు పరిష్కరించాలని, కాలేజీ ప్రిన్సిపాల్   శశిధర్ రెడ్డి శనివారం అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాలేజీలో సైన్స్ సబ్జెక్టులకు పర్మిషన్ ఇవ్వాలని

లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. స్పందించిన స్పీకర్  వెంటనే కమిషనర్ కు ఫోన్  చేసి సమస్యలు పరిశీలించాలని ఆదేశించినట్లు ప్రిన్సిపాల్  తెలిపారు.