టూరిజానికి ఇండోనేసియా పెట్టింది పేరు. అక్కడి బీచ్‌లు, సముద్రాల అందాలు చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతుంటారు. బీచ్‌లతో పాటు అడవులు, పచ్చదనానికీ ఆ దేశం మస్తు ఫేమస్. ముఖ్యంగా అక్కడి అడవుల్లోని గ్రీన్‌హౌస్‌లు. ఇలాంటి పచ్చని ఇళ్లల్లో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. పూర్తిగా లోకల్ వెదురు (అస్పర్ బాంబూ)తో కట్టిన ఆ ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. బాలిలోని ఆయుంగ్ నది లోయలో ఉంది ఈ హౌస్. పేరు ఆరా హౌస్. ఆ దేశ సర్కారు గ్రీన్ విలేజ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఆ ఇంటిని కట్టారు. మెట్లు, గోడలు, ప్రైవేటు స్విమ్మింగ్ ఫూల్ ఇలా ప్రతిదీ వెదురుమయమే. కళ్లు చెదిరేలా ఇల్లుంటే సోషల్ మీడియాలో ఎందుకు చక్కర్లు కొట్టదు మరి.
