మద్యం మత్తులో సంపులో పడి వ్యక్తి మృతి

వికారాబాద్, వెలుగు: మద్యం మత్తులో నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్​ జిల్లా కోటమర్పల్లి గ్రామానికి చెందిన చాకలి రాములు(49) గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్​సమీపంలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. 

బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మర్పల్లి ఎస్ఐ సురేశ్​ తెలిపారు.