సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు రుద్రారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది తల్లి. కుటుంబకలహాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది . ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి సావిత్రి (28) ముగ్గురి పిల్లల జశ్వంత్(5) చిన్మయి(3)చిత్ర(3) లకు విషం ఇచ్చి తాను ఉరి వేసుకునీ ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్లు చెప్పారు.
ALSO READ | తెలంగాణలో వర్షాలకు 9 మంది మృతి
మృతులు సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం రుద్రారం గ్రామానికి వచ్చి ఇస్నాపూర్ లో బైక్ మెకానిక్ పనిచేస్తున్నట్లు భర్త ఆంజనేయులు తెలిపాడు. భర్త తాగుడుకు బానిసై కిడ్నీలు పాడైపోయి నందు వల్ల ఇంటిని పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన పిల్లలకు విషమిచ్చి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.