యాదాద్రి/భూదాన్ పోచంపల్లి వెలుగు: సీఎంఆర్‌కు ఇచ్చిన రూ.10 కోట్ల విలువైన వడ్లను ఓ మిల్లర్ పక్కదారి పట్టించిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. సివిల్సప్లయ్ఆఫీసర్ల తనిఖీల్లో బయటపడడంతో షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్లోని లక్ష్మీ నర్సింహా ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2022 –-23 సంవత్సరంలో యాసంగి సీజన్‌కు సంబంధించి11.632 టన్నుల వడ్లను సీఎంఆర్కోసం సివిల్ సప్లయ్డిపార్ట్మెంట్ఇచ్చింది.
గత జనవరి నాటికి కేవలం1, 440 టన్నుల వడ్లకు మాత్రమే సీఎంఆర్‌ను మిల్లు ఓనర్అందించాడు. కాగా.. వడ్లను ముందుగా ప్రభుత్వం టెండర్వేయగా యాదాద్రి జిల్లా మిల్లుల్లోని సీఎంఆర్ స్టాక్‌ను కేంద్రీయ బండారు సంస్థ ఆక్షన్‌లో కొనుగోలు చేసింది. ఇందులో లక్ష్మీనర్సింహా ఆగ్రో ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన10,192 టన్నులు వడ్లు కూడా ఉన్నాయి. అనంతరం వడ్ల సేకరణకు ప్రయత్నించగా మిల్లు ఓనర్శ్రీనివాస్3,555 టన్నులకు సంబంధించి డబ్బులు చెల్లించినట్టు తెలిసింది.
మిల్లును కూడా క్లోజ్చేశాడు. దీంతో ఆక్షన్‌లో వడ్లను కొనుగోలు చేసిన సంస్థ ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. దీంతో సివిల్సప్లయ్డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. మంగళవారం మిల్లులో తనిఖీ చేసేందుకు అధికారులు వెళ్లారు. అక్కడ వడ్లు స్టాక్చేసిన తీరును పరిశీలించి ఆశ్చర్యపోయారు. కుప్పలుగా పోసి వడ్ల బస్తాలు లెక్కించే విధంగా లేవు. మిల్లు ఓనర్‌కు ఫోన్‌చేయగా బుధవారం వస్తానని సమాచారం ఇవ్వగా ఆఫీసర్లు వెళ్లిపోయారు.
Also Read : కేసీఆర్.. పెద్దరికం నిలుపుకో..అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వు
1.65 లక్షల బస్తాలకు.. ఉన్నవి 40 వేలే..
మరోసారి బుధవారం మిల్లు వద్దకు వచ్చిన సివిల్ సప్లయ్ ఆఫీసర్లు ఓనర్‌కు ఫోన్‌చేశారు. వెంటనే వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో తహసీల్దార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లులో తనిఖీలు నిర్వహించారు. వడ్ల బస్తాలు అడ్డదిడ్డంగా ఉండడంతో చాలా ప్రయాస పడుతూ లెక్కించారు. మిల్లులో యాసంగి సీజన్లో ఇచ్చిన వడ్లలో 6.643 టన్నులు(1.65 లక్షల బస్తాలు) స్టాక్ఉండాల్సి ఉంది.
కాగా.. ఇందులో కేవలం 40 వేల బస్తా లు మాత్రమే నిల్వ ఉండడంతో ఆఫీసర్లు షాక్ అయ్యారు. దీంతో రూ. 10 కోట్ల విలువైన వడ్లను మిల్లు ఓనరు అమ్ముకున్నాడని వెల్లడైంది. తనిఖీల అనంతరం మిల్లును సీజ్‌చేశారు. మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సివిల్ సప్లయ్ డీఎం జగదీశ్ కుమార్ తెలిపారు.