హైటెక్ యుగం దాటి ఏఐ యుగం నడుస్తుంది. అప్పడు.. ఇప్పుడు.. ఎప్పుడు.. సోషల్ మీడియా రూటే వేరు.. ఎవరు ...ఎప్పుడు.. ఎలా .. పాపులర్ అవుతారో తెలియదు. ఒక్కోసారి జనాలు చేసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోనే ఇంటర్ నెట్ షేక్అవుతుంది. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి తన భార్యతో కలిసి చేసిన రొమాంటిక్ సాంగ్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.. ఇక అంతే భార్యతో వీడియో తీయడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాఘభాయ్ తన భార్యతో కలిసి 'రాజా హిందుస్తానీ' చిత్రంలోని ఒక పాటలో నటిస్తున్నాడు. ఈ పాటను ఆయన పాడుతుండగా.. ఆమె డ్యాన్స్ చేస్తుంది. అతని భార్య రెడ్ కలర్ లెహంగా ధరించింది. వాఘభాయ్ దంపతులు చాలా క్యూట్‌గా ఉన్నారు. ఈ పాటను ఆయన పాడుతూ.. ఆమె చేసిన డ్యాన్స్ ను వాఘభాయ్ పర్మార్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక అంతే నెటిజన్స్ ఊరుకుంటారా... ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
వాఘభాయ్ తన భార్యతో రొమాంటిక్ సాంగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టె చేయడంతో సోషల్ మీడియా వినియోగ దారులు డర్టీ కామెంట్స్ పెట్టారు. గుర్రాలకు గడ్డా దొరకడం లేదని.. గాడిదలు చ్యవనప్రాష్ తింటున్నాయని ఎవరో రాస్తే.. తమ్ముడా.. నీ భార్య ఒంటరిగా ఉందామరొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) ఈ వీడియోను 20 లక్షల మందికి పైగా వీక్షించగా.. 84 వేల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, వేలాది మంది షేర్ చేశారు. నెటిజన్లు చాలామంది డర్టీ కామెంట్స్ చేస్తున్నారు. తీపి పదార్దాల్లో కీటకాలు ఉంటాయని చెప్పేందుకు ఈ వీడియో చరిత్ర సాక్షి అని ఒకరు రాశారు. ఇంకొకరు లంగూర్ కు ద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చిందని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోను చూసిన మరొక వ్యక్తి .. నాకు కొంచెం విషం ఇవ్వండి.. నీళ్లలో మునిగి చనిపోతాను.. కాని నాకు ఈత వచ్చని అర్దం లేని కామెంట్ చేశారు. నాల్గవ వ్యక్తి ఇది డబ్బు మాయాజాలం.. చూడండి.. చూసి చలా సంపాదించండి అని రాసుకొచ్చారు.
వాఘభాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1 లక్షా 86 వేల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఇతను సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి మాదిరిగా ఉన్నాడు. వాఘాభాయ్ .. అతని భార్య చేసిన రొమాంటిక్ సాంగ్ వీడియోపై కొంతమంది నెటిజన్స్ అసభ్యకరంగా స్పందించగా .. కొంతమంది మంచి విషయాలు కూడా రాశారు. నరేష్ గోస్వామి అనే వినియోగదారుడు దేవుడు మీ ఇద్దరినీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని రాయగా... సిను అనే మరొక వ్యక్తి కింగ్ ఆఫ్ పర్మార్ అని రాశారు.