సినిమా పెద్దలు కాదు.. గద్దలు: ఫ్లకార్డుతో కమాండ్​ కంట్రోల్​ సెంటర్ ​వద్ద ఓ వ్యక్తి నిరసన

జూబ్లీహిల్స్, వెలుగు : బంజారాహిల్స్ రోడ్​నం.12లోని పోలీస్​కమాండ్​కంట్రోల్​సెంటర్ వద్ద గురువారం అబ్దుల్లాపూర్​మెట్​మండలంలోని తుర్కయాంజల్​కు చెందిన నీరజ్ వాల్మీకి అనే కిరాణా వ్యాపారి నిరసనకు దిగాడు. లోపల సీఎం రేవంత్​రెడ్డితో సినిమా ఇండస్ట్రీ పెద్దలు సమావేశం జరుగుతున్న టైంలో ‘సినిమా పెద్దలు కాదు గద్దలు’ అనే ఫ్లకార్డుతో ఆందోళన చేశాడు.

సామాన్యుల సమస్యలు సినిమా వాళ్లకు పట్టవా,  సినిమా టికెట్ల రెట్లు పెంచొద్దు.. వారు సినీ పెద్దలు కాదు.. గద్దలు అంటూ నినాదాలు చేశాడు. బంజారాహిల్స్​ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.