సిద్దిపేట జిల్లాలో లారీ ఢీకొని వడ్ల ట్రాక్టర్ బోల్తా

బెజ్జంకి,వెలుగు : వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో బోల్తాపడింది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం నుంచి రైతులకు సంబంధించిన వడ్లను ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌లో రైస్ మిల్లుకు తీసుకెళ్తున్నారు.

బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. దీంతో దానిలోని వడ్ల బస్తాలన్నీ రోడ్డపై చెల్లాచెదురుగా పడిపోయాయి.