హీయో హైడ్రో ఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​

అరుణాచల్​ప్రదేశ్​లోని షియోమి జిల్లాలో సుబన్​ సిరి నదికి ఉపనది అయిన హీయో నదిపై హియో జల విద్యుత్తు ప్రాజెక్టు (హీయో హైడ్రో ఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్ –హెచ్​ఈపీ)ని రూ.1939 కోట్లతో నిర్మించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్​ 50 నెలల్లో పూర్తికానున్నది. 

సామర్థ్యం: హీయో హెచ్​ఈపీ స్థాపిత సామర్థ్యం 240 మెగావాట్లు, ఇందులో 80 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1000 మిలియన్​ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనున్నది. ఈ ప్రాజెక్టును జాయింట్​ వెంచర్​ కంపెనీ ద్వారా అరుణాచల్​ప్రదేశ్​ ప్రభుత్వం, నార్త్​ ఈస్టర్న్​ ఎలక్ట్రిక్​ పవర్​ కార్పొరేషన్​(ఎన్​ఈఈపీసీఓ)లు సంయుక్తంగా అమలు చేస్తాయి. ఆత్మనిర్భర్​ భారత్​ అభియాన్​ లక్ష్యాలకు, ఉద్దేశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు స్థానిక రవాణా సంస్థలకు, వ్యాపార సంస్థలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్​ఎంఈ)లకు అనేక ప్రయోజనాలను అందించనున్నది. ఈ ప్రాజెక్ట్​ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. 
అరుణాచల్​ప్రదేశ్​లో జల విద్యుత్​ సామర్థ్యం: రాష్ట్రంలో జల విద్యుత్​ ప్రాజెక్టుల ద్వారా 58,000 మెగావాట్లకు పైగా విద్యుత్​ ఉత్పత్తి అవుతుంది. భారత్​దేశం మొత్తం జలవిద్యుత్​ సామర్థ్యంలో సుమారు 40 శాతం అరుణాచల్​ప్రదేశ్​ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది. 

షియోమి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులు

టాటో–1 హెచ్​ఈపీ(186 మెగావాట్లు)
పౌక్​ హెచ్​ఈపీ (145 మెగావాట్లు)
టాటో–2 హెచ్​ఈపీ(700 మెగావాట్లు)
నాయింగ్​ హెచ్​ఈపీ (1000 మెగావాట్లు)
హిరోంగ్​ హెచ్​ఈపీ (500 మెగావాట్లు)
రెగో హెచ్​ఈపీ (70 మెగావాట్లు)
రాపమ్​ హెచ్​ఈపీ (8‌0 మెగావాట్లు)
కంగ్తంగర్షిరి హెచ్​ఈపీ (80 మెగావాట్లు)