తుఫాన్ బిపర్ జాయ్ విధ్వంసం,, బీభత్సం గుజరాత్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇదే సాక్ష్యం. తుఫాన్ తీరం దాటక ముందే.. దేవభూమి ద్వారక, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల తీవ్రత ఏ విధంగా ఉంది అంటే.. శ్రీకృష్ణుడు జన్మస్థలం అయిన ద్వారకలోని వందేళ్ల నాటి మహా వృక్షం కూకటి వేళ్లతో సహా నేలకొరిగింది.
2023, జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రచండ గాలులకు.. ద్వారకలోని నాగేశ్వర జ్యోతిర్లింగం సమీపంలోని భారీ మర్రి చెట్టు వేళ్లతో సహా నేలకొరిగింది. వందేళ్ల నాటి ఈ చెట్టును ప్రజలు ఎంతో భక్తితో పూజిస్తారు. ద్వారక వచ్చిన భక్తులు.. ఈ చెట్టు దగ్గర సేదతీరటంతోపాటు.. తమ కోరికలు తీరాలంటూ చెట్టుకు దారాలు కూడా కడతారు.
ఈ మహా వృక్షం నేలకొరగడాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టటంతో వైరల్ అయ్యింది. ఈ చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకుని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిపర్ జాయ్ తుఫాన్ గండం నుంచి గుజరాత్ ను ఆ శ్రీకృష్ణుడు కాపాడాలంటున్నారు నెటిజన్లు. తుఫాన్ బీభత్సం ఏ విధంగా ఉందో ఈ ఘటన చెబుతుందని మరికొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవభూమి ద్వారకను, గుజరాత్ కు విపత్తు సమయంలో అందరం అండగా ఉండాలంటూ మరికొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.
ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. బిపర్ జాయ్ తుఫాన్ ధాటికి దేవభూమిలో ఓ మహా వృక్షం అయితే నెలకొరిగింది. తీరం దాటిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
https://twitter.com/AnilKumarVerma_/status/1669281143437262848
