ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్.. విచ్చలవిడిగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు

రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.  విచ్చలవిడిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీ చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి.  ఫీజ్ రియంబర్స్  మెంట్ , స్కాలర్ షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారిలో సర్టిఫికెట్ల జారీ చేశారు.  ఒక్కో సర్టిఫికెట్లుకు 50  వేల నుంచి  5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  కొంత మంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లోని పలు మీసేవ కేంద్రాల ద్వారా గ్యాంగ్ సభ్యులు దరఖాస్తు చేస్తున్నారు.  అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేసి నేరుగా ఇంటికే పంపిస్తున్నారు గ్యాంగ్ సభ్యులు.  VRA,DT,RI ల రిపోర్టు ప్రమేయం లేకుండానే వ్యవహారం గుట్టుచప్పుడుగా  నడుస్తుంది. 

2022 సంవత్సరం ఫిబ్రవరి నుండి 2024 వరకు 800 పైగా అప్లికేషన్స్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా సమాచారం.  తహసీల్దార్ డిజిటల్ కీ సంతకంతో గుట్టుచప్పుడు కాకుండా వందల సంఖ్యలో సర్టిఫికెట్లు అమ్ముకుని భారీగా డబ్బలు దండుకున్నారు.  మండల తాహశీల్ధార్ కార్యాలయంలో పనిచేసే  కంప్యూటర్ ఆపరేటర్ (అవుట్ సోర్సింగ్) ఉద్యోగి సురేష్ తోపాటు మరికొదరి పై కేసు నమోదు చేశారు పోలీసులు.  DMWO (District Minority Office) ఆఫీస్ నుండి మండల ఆఫీస్ కి లేటర్ రావడంతో అధికారులు పరిశీలించారు. 

 తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వందల అర్జీదారులు ఎవరనేది ఎంక్వయిరీ చేయాగా నాన్ లోకల్ అని తేలింది .  అప్లికేషన్లు కుప్పులు తెప్పలుగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు.  మూడు ఫోన్ నెంబర్లతో850కి పైగా  ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్లను ఎలాంటి పత్రాలను ఆప్లోడ్ చేయకుండా సర్టిఫికెట్లు పొందారు.  స్కామ్ కు పాల్పడిన వారిపై మంచాల పోలీసు స్టేషన్ లో కేవలం 57 దరఖాస్తులపై మాత్రమే పిర్యాధు చేశారు మంచాల ఎమ్మార్వో ప్రసాద్. 420,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.