న్యూఢిల్లీ: పవర్ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ ప్రభుత్వ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నుంచి రూ. 2,570 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను పొందినట్లు తెలిపింది. టెలికాం టవర్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు కల్పించడం, డివైజ్‌ల ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వంటి పనుల కోసం రూ.2,570 కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నట్టు వెల్లడించింది.
రాజస్థాన్, ఒడిశాలో ఐదు సంవత్సరాల పాటు క్యాపెక్స్, ఓపెక్స్ మోడల్‌లో 4జీ ప్రాజెక్టులు అమలు చేస్తుంది. ఇప్పటికీ ఏ విధమైన మొబైల్ కమ్యూనికేషన్ లేని లేదా 2జీ/ 3జీ కనెక్టివిటీ మాత్రమే ప్రాంతాల్లో 4జీ కనెక్టివిటీని అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లకు స్వదేశీ 4జీ టెక్నాలజీ వాడతామని, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా నిధులు సమకూరుస్తారని స్కిప్పర్ తెలిపింది.
