IND Vs NZ, 1st Test: అదృష్టం మన వైపే: పంత్ ఈజీ రనౌట్ మిస్ చేసిన న్యూజిలాండ్

బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ వికెట్ కోసం నానా తంటాలు పడుతుంది. వరుస విరామాల్లో వికెట్లు తీయడంలో విఫలమవుతుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ లో పట్టుదల చూపించడంతో వికెట్ కోసం శ్రమిస్తోంది. ముఖ్యంగా పంత్, సర్ఫరాజ్ భారీ భాగస్వామ్యం నెలకొల్పుతూ కివీస్ ను టెన్షన్ పెడుతున్నారు. ఈ సమయంలో న్యూజిలాండ్ ఒక చక్కని అవకాశాన్ని చేజార్చుకుంది. రనౌట్ చేజార్చుకొని తగిన మూల్యం చెల్లించుకుంది.  

ఇన్నింగ్స్ 56 ఓవర్లో హెన్రీ వేసిన తొలి బంతిని సర్ఫరాజ్ డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌ దిశగా ఆడాడు. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న పంత్ తో కలిసి తొలి పరుగు పూర్తి చేసుకున్నాడు. రెండో పరుగు కోసం పంత్ సర్ఫరాజ్ రమ్మని పిలిచాడు. పిచ్ సగం మధ్యకీ వచ్చిన తర్వాత సర్ఫరాజ్ వెనక్కి వెళ్ళమన్నాడు. ఇదే సమయంలో వికెట్ కీపర్ బ్లండర్ త్రో కోసం స్టంప్స్ కు చాలా దూరం ముందుకు వెళ్ళాడు. కివీస్ ఆటగాడు  త్రో సరిగా వేయకపోవడం భారత్ కు కలిసి వచ్చింది. దీంతో పంత్ క్రీజ్ కు చేరుకొని ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ALSO READ | IND Vs NZ, 1st Test: సెంచరీతో సత్తా చాటిన సర్ఫరాజ్.. న్యూజిలాండ్‌కు టెన్షన్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ నాలుగో రోజు లంచ్ కు ముందు 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో సర్ఫరాజ్ తో పాటు హాఫ్ సెంచరీ చేసిన పంత్ (53) ఉన్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 132 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు. భారత్ కేవలం 12 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది.