పండుగ సాయన్నకు ఘన నివాళి

మరికల్​, వెలుగు : పండుగ సాయన్న ఆశయాలను భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం సాయన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముదిరాజ్​సంఘం నాయకులతో పాటు అఖిల పక్ష నాయకులుపాల్గొన్నారు. 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండగ సాయన్న వర్ధంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రాం చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూస్వాములు, పెత్తందారులను దోచి పేదలకు పంచిపెట్టిన విప్లవ యోధుడు పండుగ సాయన్న అన్నారు.  ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎంపీ ప్రవీణ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు బొర్ర సురేశ్ కుమార్,  రవి కిరణ్, రియాజుద్దీన్, బోయపల్లి నర్సింహ, సామ్యూల్, గోపాలకృష్ణ, పాతూరు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.