కట్టె తలపై పడి బాలిక మృతి

గద్వాల, వెలుగు: ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు పాతిన కట్టె విరిగి తలపై పడి తొమ్మిదేళ్ల బాలిక చనిపోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్  మండలం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన వెంకటన్న, నాగమ్మ భార్య భర్తలు. వీరి కూతురు సునీత(9) గురువారం సాయంత్రం ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు రెండు కట్టెల మధ్య ఉన్న డ్రిప్​పైప్‎ను పట్టుకొని ఊగుతుండగా, ప్రమాదవశాత్తు కట్టె తలపై పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. తల్లి బయటకు వెళ్లి వచ్చే లోపే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.