శివ శివా : శ్రీశైలం శిఖరం నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఇదే..!

లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. లోన్ యాప్స్ మోసాలకు, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా జనాలు మారటం లేదు.. తాజాగా లోన్ యాప్ వేధింపులకు మరో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం ( డిసెంబర్ 9, 2024 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతి శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలోని కొండపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. 

అయితే.. ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన యువతిని శ్రీశైలం పోలీసులు కాపాడారు. లోన్ యాప్ వేదింపులు తట్టుకోలేక శ్రీశైలం వచ్చి కొండపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది యువతి. 

ALSO READ | ఓ మంచి దొంగ..

యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్స్ ద్వారా లోన్లు తీసుకోవద్దని.. ఒకవేళ తీసుకున్నా కూడా వేధింపులకు బయపడి ఆత్మహత్యాయత్నం వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నారు పోలీసులు.