వింటర్ లో గుండె, కండ్లు భద్రం!

వింటర్ లో గుండె, కండ్లు భద్రం!

న్యూఢిల్లీ: చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే హార్ట్ ఎటాక్స్ ముప్పు, కంటి సమస్యలు పెరుగుతాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా చలి వాతావరణానికి గురైతే రక్తనాళాలు మూసుకుపోయి, బ్లడ్ ప్రెజర్ పెరిగే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ఇదివరకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.

దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్, ఓర్బిస్ ఇంటర్నేషనల్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రిషి రాజ్ బోరా ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేశారు. చలికాలం కండ్లు పొడిబారినట్లు అవుతాయని, గాలి కాలుష్యం ప్రభావం కూడా పడుతుందని వారు చెప్పారు. జాగ్రత్తగా ఉండకపోతే కంటి సమస్యలు పెరిగి, చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. మంచి ఫుడ్ తీసుకోవడం, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చలికాలంలో గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.