
ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన డేటా డిలీట్ కాదు. కేవలం తక్కువగా వాడిన యాప్ డేటా మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్స్‌కు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్స్‌లో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అనేది ఒక ఫీచర్. దీంతో యాప్‌ను పూర్తిగా అన్ ఇన్స్టాల్ చేయకుండా ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర డివైజ్‌లలో స్టోరేజ్ స్పేస్ ఖాళీ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను యూజర్లు సెలక్ట్ చేసుకుంటే వాళ్ల ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ డివైజ్‌లలో తక్కువగా వాడే యాప్‌లు పార్షియల్గా తొలగిపోతాయి. దీంతో వాటి మేరకు ఉన్న స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. యూజర్ల డేటా, పార్షియల్గా అన్ఇన్స్టాల్ అయిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తీసేసిన యాప్ మళ్లీ వాడాలనుకుంటే దాన్ని మరోసారి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి యాప్ డేటా పోయిందో తిరిగి అక్కడి నుంచే కంటిన్యూ చేయొచ్చు.
ఈ ఫీచర్ ఉంటే...
ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఫోన్, ఇతర డివైజ్‌లలో స్టోరేజీ స్పేస్ తక్కువగా ఉంటే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వాడమని చెప్తుంది. ఆ ఫీచర్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే తక్కువ వాడకంలో ఉన్న యాప్‌లను గుర్తించి, ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. అయితే యాప్ బండిల్‌తో తయారు చేసిన యాప్‌లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్ డిజైన్ల కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్.