విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కొత్తవలస సమీపంలో రైలు పట్టాలు తప్పింది. విశాఖ - -రాయగడ ప్యాసింజర్ ట్రైన్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో ట్రైన్ స్పీడ్ తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రాక్ మార్చే క్రమంలో ప్రమాదం జరిగింది. లోకో పైలట్ అప్రమత్తంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొత్తవలస రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైల్వే సిబ్బంది, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ALSO READ :- ఫాల్గుణమాసం విశిష్టత ఏమిటి.... ఎప్పటి నుంచి ప్రారంభమో తెలుసా