పోలీసులు వేధిస్తున్నారని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన రైతు

పోలీసులు వేధిస్తున్నారని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన రైతు

అనంతపురం: పోలీసులు వేదిస్తున్నారని ఆరోపిస్తూ… కుడేరు మండలం కడదరకుంట గ్రామంలో సురేష్ అనే రైతు ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కాడు. తనకు న్యాయం జరగలేదు కాబట్టి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అదరికీ ఫోన్లు.. వాట్సప్ లలో మెసేజీలు పంపడంతో వ్యవహారం స్థానిక ప్రాంతంలో వైరల్ అయింది.  స్థానిక నాయకులు.. పోలీసులు రైతు పొలం దగ్గరకు వచ్చి సంప్రదింపులు చేపట్టారు.

తన అనుమతి లేకుండా తన పొలంలో యాక్సిస్ కంపెనీ వారు విద్యుత్ లైన్ వేశారని ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకపోగా కంపెనీ పిర్యాదు చేసిందని తనపై అక్రమంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారని రైతు సురేష్ చెబుతున్నాడు. తన అనుమతి లేకుండా పొలంలో అక్రమంగా ఆక్సిస్ పవర్ వేసిన కరెంటు లైన్ వేయమని తాను పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. తన ఫిర్యాదును పట్టించుకోకుండా కంపెనీ ఫిర్యాదు  తనపై కేసులు పెట్టారని  ఆరోపిస్తున్నడు. ఎస్.ఐ బెదిరింపులు భరించలేకనే తాను సబ్ స్టేషన్ దగ్గరకొచ్చి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సి వచ్చిందంటున్నాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ కావడంతో రైతును బుజ్జగిస్తున్నారు.