ప్రకాశం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ప్రకాశం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

సూరారెడ్డిపాలెం వద్ద బ్రిడ్జిపై నుంచి జారిపడ్డ 5 డీజిల్ లోడ్ బోగీలు

5 ట్యాంకర్లలోని డీజిల్ దగ్ధం.. 

ట్రాక్ కుంగిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానం.. 

విజయవాడ నుండి చెన్నై వెళ్తుండగా ప్రమాదానికి గురైన గూడ్సు

ప్రకాశం జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. సూరారెడ్డిపాలెం వద్ద గూడ్సు రైలు నుండి విడిపోయిన 3 బోగీలు బ్రిడ్జిపై నుండి కిందకు పడిపోయాయి. కిందపడిన వెంటనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. పట్టాలకు సమీపంలో బ్రిడ్జి పక్కన పడిపోయిన మరో రెండు ట్యాంకర్లకు కూడా మంటలు వ్యాపించాయి. హఠాత్తుగా జరిగిన ఘటనను గుర్తించిన గూడ్సు రైలు డ్రైవర్.. గార్డులు… సమీప స్టేషన్ల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పే పని చేపట్టారు. తెల్లవారుజామున వెళుతురు వచ్చాక ట్రాక్ కుంగిపోయి ఉండడంతో.. డీజిల్ లోడ్ ట్యాంకర్లు ఉన్న మూడు బోగీలు జారిపడినట్లు గుర్తించారు. ట్రాక్ కుంగిపోయి ఉండడం..  డీజిల్ ట్యాంకర్ల లోడ్ హెవీగా ఉండడం వల్లే బోగీలు పట్టాలు తప్పినట్లు గుర్తించారు.   బ్రిడ్జిపై నుండి కిందకు పడిన వెంటనే ట్యాంకర్ల మూతలు తెరచుకోవడం వల్ల మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం గ్రామం వద్ద ఘటన జరిగింది. ఎగిసిపడుతున్న అగ్నికీలలు ఆపేందుకు బిట్రగుంట – విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది…. రంగంలోకి దిగారు. ఈలోగా నాలుగు ఆయిల్ ట్యాంకర్ల బోగీలు దగ్ధం అయ్యాయి. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. ఈ గూడ్సు రైలు విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.