21 మంది స్టూడెంట్లపై లైంగిక దాడి చేసిన  వార్డెన్​కు మరణ శిక్ష

  • అరుణాచల్ ప్రత్యేక కోర్టు తీర్పు

గువాహటి:  ఇరవై ఒక్క మంది స్టూడెంట్లపై అత్యాచారానికి, వేధింపులకు పాల్పడ్డ ఓ హాస్టల్ వార్డెన్​కు కోర్టు మరణ శిక్ష విధించింది. ఇందుకు సహకరించిన హెడ్మాస్టర్​కు, విషయం తెలిసినప్పటికీ కావాలనే  పైఅధికారుల దృష్టికి తీసుకురాని ఓ మహిళా టీచర్​కు 20 ఏండ్ల జైలు శిక్ష వేసింది.

అరుణాచల్  ప్రదేశ్​లోని షి యోమి జిల్లా ప్రభుత్వ రెసిడెన్సియల్ స్కూల్​లో వార్డెన్​గా పనిచేస్తున్న యుంకెన్ బాగ్రా.. 2014 నుంచి 2022 వరకు 21 మంది స్టూడెంట్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఏడుగురు అబ్బాయిలు కూడా ఉన్నారు. తమ ఇద్దరు కూతుళ్ల(కవలలు)పై వార్డెన్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పేరెంట్స్​ 2022 నవంబర్​లో మోనిగాంగ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.