ఫోన్ ఛార్జర్‌కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు

ఇంట్లో ఒక ఫోన్ ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మరో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వాడుతుంటారు చాలామంది. అలాంటప్పుడు ఆ ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సరిపోతుందా? లేదా? అని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని వాడాలి. అలా చెక్​ చేసుకునేందుకు ఈ ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని  వాడాలి. దీన్ని కిట్స్ గురు అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ఇది న్యూ జనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటిగ్రల్ సైకిల్ కన్వర్షన్ ఐసీ ఆధారంగా పనిచేస్తుంది. 

కచ్చితమైన అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వోల్టేజీ చూపిస్తుంది. ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఉండే యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఫిమేల్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఈ గాడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉండే మెయిల్ ఫోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. గాడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిమేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కనెక్ట్ చేయాలి. అప్పుడు డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే మీద ఎంత వోల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పవర్ సప్లై అవుతుందనేది కనిసిస్తుంది. దీన్ని అన్ని రకాల ఛార్జర్లకు వాడొచ్చు. 

ధర : 249 రూపాయలు