ఊహించని ట్విస్ట్ : సినిమాలో చంద్రబాబులా నటించిన నటుడు శ్రీతేజ్ పై కేసు

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా అరెస్టులు కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలు, నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో.. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ జరిగాయి. ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ ఒకటి జరిగింది. 

లక్ష్మీస్ ఎన్జీఆర్ మూవీ ఉంది కదా.. ఆ సినిమాలో చంద్రబాబు పాత్రలో నటించిన నటుడు శ్రీతేజ్ (Sri Tej)పై హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శ్రీ తేజ్ పై BNS 69, 115(2),318(2) పలు సెక్షన్ ల కింద పోలీసులు కేస్ నమోదు చేసుకుని విచారించనున్నారు. గతంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండగా.. విషయం తెలుసుకున్న ఆమె భర్త గుండెపోటు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం శ్రీతేజ్ టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే అంజలి నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో నటించాడు. దళారి, మంగళవారం, రావణాసుర, పుష్ప వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.