Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మపై పోలీస్ కేసు.. ఎందుకంటే?

డైరెక్టర్ ఆర్జీవీ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham),శపథం (Shapatham) సినిమాల అనౌన్స్ తర్వాత వాయిదాల పర్వం ఎలా జరిగిందో తెలిసిందే. ఈ క్రమంలో వ్యూహం రిలీజ్ చేయడం కోసం చాలా ప్రయత్నాలే చేసాడు వర్మ. అయితే.. ఇప్పడు ఇదంతా ఎందుకనుకుంటారా?

తాజాగా రామ్‌గోపాల్‌ వర్మపై ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా.. ఆర్జీవీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాస్తవానికి ఈ సినిమా 2024 ఫిబ్రవరి 23న రిలీజ్ కావాలి. కానీ, వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఈ సినిమాను 2024 మార్చి 2న రిలీజ్ చేశారు.