ఉద్దేశ పూర్వకంగా కరోనా వ్యాప్తికి పాల్పడితే 20 లక్షల ఫైన్, ఐదేళ్ల జైలు శిక్ష

ఉద్దేశ పూర్వకంగా కరోనా వ్యాప్తికి పాల్పడితే 20 లక్షల ఫైన్, ఐదేళ్ల జైలు శిక్ష

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు రోజు రోజుకి విజృంభిస్తున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశాధినేతలు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తూ తన సంఖ్యను పెంచుకుంటూ పోతుంది.

ఈ నేపథ్యంలో యూఏఈ కొన్ని ఆంక్షల్ని అమలు చేసింది. యుఏఈలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆదేశ ప్రభుత్వం ప్రతీ ఒక్కరికి కరోనా టెస్ట్ లు చేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు విఫలం అవ్వడం కరోనా కేసులు పెరిగిపోతూండడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తే వారికి 20లక్షలు, అంటు వ్యాధుల్ని వ్యాప్తి చేసిన వారికి 50వేల నుంచి లక్ష డాలర్లు జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష  విధిస్తున్నట్లు ఆ దేశ మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్  ప్రకటించింది.

ఆరు సంవత్సరాల క్రితం అందుబాటులోకి తెచ్చిన వ్యాధుల సంక్రమణ చట్టం ప్రకారం ఈ శిక్షను అమలు చేస్తున్నట్లు అల్ రోవాడ్ న్యాయవాదులతో యూఏఈ న్యాయ సలహాదారు డాక్టర్ హసన్ ఎల్హాయిస్ తెలిపారు. వ్యాధుల సంక్రమణ చట్టం ప్రకారం ఉద్దేశ పూర్వకంగా వైరస్ లను అంటిస్తే నేరమని దీని వల్ల సమాజంలో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. చట్టంలో ఉద్దేశ పూర్వకంగా ఓ వ్యక్తికి వ్యాధికి సోకి మరణిస్తే అందుకు కారణమైన నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష అమలవుతుందని, లేదంటే కేసు తీవ్రతను బట్టి ఉరిశిక్షను అమలు చేస్తామని యూఏఈ న్యాయ సలహాదారు డాక్టర్ హసన్ ఎల్హాయిస్ స్పష్టం చేశారు.