ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన అయిదుగురు మృతి

ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన అయిదుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని సియోనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఒక కుటుంబం సోమవారం రాత్రి బెంగుళూరుకు వెళ్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు సియోనీ సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు అతివేగమే కారణమని బుందోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దిలీప్ పంచేశ్వర్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన ఐదుగురిలో నలుగురిని విజయ్ బహదూర్ పటేల్, అతని భార్య సరిత, వారి కుమారుడు అజయ్ కుమార్, మరొకరు వారి బంధువు రాధాగా గుర్తించారు. మరో మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ప్రమాదంలో ఒక తొమ్మిదేళ్ల బాలిక మరో నాలుగేళ్ల చిన్నారి గాయపడ్డారని.. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. For More News.. మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన అమెరికా టాప్ 100లో చోటుదక్కించుకున్న యాక్టివిస్ట్ అనుమానాస్పద మృతి అందుకే ఆయనకు ‘గుడిసెల వెంకటస్వామి’ అనే పేరొచ్చింది