లేగ దూడకు బారసాల

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లా మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామానికి చెందిన కుమ్మరి అంజయ్య ఇంట్లో లేగ దూడకు బారసాల చేశారు. అంజయ్య దంపతులు పెంచుకుంటున్న ఆవు మగ లేగదూడకు జన్మనిచ్చింది. దీంతో 21వ రోజైన బుధవారం రాత్రి ఆ రైతు కుటుంబ సభ్యులు లేగ దూడను తొట్టెలో వేసి డోలారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులను పిలిచి విందు భోజనాలను ఏర్పాటు చేశారు.