ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‎లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తో్న్న కూలీల ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం (నవంబర్ 23) రాత్రి తలగాసిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. 

ALSO READ | పోలీస్ కారులోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఈ ఘోర ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.   మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.