తిరుమలలో నడుస్తూ వెళుతున్న భక్తురాలిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ..

తిరుమలలో చెట్టు విరిగిపడ్డ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జాపాలి తీర్థం వద్ద మహిళ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చెట్టు కొమ్మ విరిగి మీద పడింది. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చెట్టు కొమ్మ ఎండిపోయి విరిగి పడి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు.