దుబ్బాక, వెలుగు: ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన పురుషోత్తం (32) ఆదివారం బైక్పై సిద్దిపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం దాటిన తర్వాత ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్ బాడీని దుబ్బాక ఏరియా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు.. కొమురవెల్లి అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయా
డు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో జరిగింది. గ్రామానికి చెందిన బండారి కను కయ్య (49) ముప్పై ఏళ్లుగా హైదరబాద్ లో ఉంటూ ఇనుప సామను వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్ల నుంచి పలు వ్యాధులతో బా ధపడుతున్నాడు. శనివారం ఉదయం గ్రామానికి వచ్చి పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.