సంగారెడ్డి జిల్లా : అమీన్పూర్ మండలం పటేల్ గూడలో పెద్ద సైబర్ ఫ్రాడ్ బయటకుపడింది. ఫేక్ ప్లాట్ ఫాంలో పెట్టుబడులు పెట్టి రూ.కోటి 80 లక్షలు పోగొట్టుకుంది. పార్ట్ టైం జాబ్ అంటూ మొబైల్ లో వచ్చిన ఓ లింక్ క్లిక్ చేసిన మహిళ విదతల వారీగా రూ.కోటి 80 లక్షల పెట్టుబడి పెట్టింది. వచ్చిన లాభం, అసలు విత్ డ్రా చేసుకుందాం అనుకోగా.. నిర్వాహకులు స్పందించడం లేదు. మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు ఫిర్యాదుకు అనుగుణంగా దర్యాప్తు చేపట్టారు.