Be alert: పార్కుల్లో పసి వాళ్లను జాగ్రత్తగా పట్టుకోండి.. లేకుంటే జరిగేది ఇదే..!

Be alert:  పార్కుల్లో పసి వాళ్లను జాగ్రత్తగా పట్టుకోండి.. లేకుంటే జరిగేది ఇదే..!
  • తండ్రి చేతుల్లోంచి జారిపడి..క్రొయేషియా వాటర్​ పార్క్​లో చిన్నారి మృతి 

జాగ్రెబ్: క్రొయేషియాలోని లోపార్‌‌లో ఉన్న ఆక్వాగన్ వాటర్ పార్క్‌‌లో విషాదం చోటుచేసుకుంది. 21 నెలల జర్మన్ చిన్నారి తన తండ్రి చేతుల్లోంచి జారి కాంక్రీట్‌‌ సర్ఫేస్ పై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 

నాలుగు మీటర్ల ఎత్తులోని వాటర్ స్లైడ్‌‌పై సరదాగా గడపుతున్న టైంలో తండ్రి చేతుల్లోంచి బాలిక జారి కాంక్రీట్‌‌ సర్ఫేస్ పై పడిపోయిందని అధికారులు తెలిపారు. వెంటనే హెలికాప్టర్ సాయంతో చిన్నారిని రిజెకా హాస్పిటల్ క్లినికల్ సెంటర్‌‌కు తరలించామన్నారు. 

కాంక్రీట్‌‌ సర్ఫేస్ పై పడటంతో  చిన్నారి మెదడుతో పాటు పలు అవయవాలు తీవ్రంగా గాయపడ్డాయని డాక్టర్లు వెల్లడించారు. దాంతో ట్రీట్మెంట్ పొందుతూ చిన్నారి చనిపోయినట్లు పేర్కొన్నారు. వాటర్ పార్క్ యజమాని జోసిప్ ఇవానిక్ ఘటనపై స్పందిస్తూ.. 30 ఏండ్లకు పైగా నిర్వహిస్తున్న ఈ పార్క్‌‌లో ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.