గ్రేటర్ లో 1. 75 లక్షల మ్యాన్ హోళ్లు క్లీన్

  •     పూర్తయిన వాటర్​బోర్డు 90 డేస్ ​స్పెషల్​ డ్రైవ్ 
  •     మరో 90 రోజులు  పొడిగించాలని నిర్ణయం
  •     బోర్డు అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందన

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​పరిధిలో మెట్రోవాటర్​బోర్డు చేపట్టిన 90 రోజుల సీవరేజ్​స్పెషల్ డ్రైవ్​ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. సిటీలోని 2,200 కి.మీ.పరిధిలో పైప్​లైన్​లు, 1.75 లక్షల మ్యాన్​హోళ్లలో డీసిల్టింగ్​పనులు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ, -ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా అధికారులు ఈ స్పెషల్​ డ్రైవ్​ను చేపట్టారు.

90 రోజుల పాటు నగరంలోని ప్రాంతాల్లో నిర్విరామంగా డీసిల్టింగ్ పనులు పూర్తిచేశారు. 17,050 ప్రాంతాల్లో మ్యాన్​హోళ్ల డీసిల్టింగ్​పూర్తయింది. స్పెషల్ డ్రైవ్ మొదలయ్యాక వాటర్​బోర్డుకు రోజూ వచ్చే సీవరేజ్ ఫిర్యాదులు 30 శాతానికి తగ్గినట్టు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. 

సీఎం రేవంత్​రెడ్డి అభినందన

స్పెషల్ డ్రైవ్ సక్సెస్​ కావడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అభినందించారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడాన్ని ప్రశంసించారు. డ్రైవ్ ను మరో 90 రోజులు పొడిగించాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో మిగిలిన పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నాటికి సీవరేజ్ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించామన్నారు. డ్రైవ్ సక్సెస్​కావడంలో అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. సమష్టి కృషి, కష్టంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి కష్టపడతామన్నారు. బాటు కల్పించారు.