కొలంబియాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. కొలంబియా ఆగ్నేయ ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గెరిల్లాలను అణచడానికి చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా 17 మంది సైన్యంతో హెలికాప్టర్ బయలుదేరినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే కొలంబియాలోని వియర్ రాష్ట్రంలో ఉన్న ఇనిరిడా నది సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిది. ఇది ప్రమాదమేనా? లేక గెరిల్లలు కూల్చివేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు ఆర్మీ అధికారులు.

