విండీస్‌తో ఫస్ట్టెస్ట్కు ఇంగ్లండ్ టీమ్ ప్రకటన
బెయిర్ స్టో, ఆలీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరగబోయే తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలింగే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శనివారం జట్టును ప్రకటించింది. దాదాపు నాలుగు నెలల తర్వాత జరగనున్న ఈ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోవడంతో బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించింది. 13 మందితో కూడిన జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో, ఆల్రౌండర్ మొయీన్అలీకి అవకాశం దక్కలేదు. కరోనా నేపథ్యంలో తొమ్మిది మందిని రిజర్వ్‌ప్లేయర్లుగా సెలెక్ట్ చేశారు. సామ్ కరన్కు రిజర్వ్ లిస్ట్‌లో చోటు దక్కింది.
జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, ఆర్చర్, డామినిక్బెస్, స్టువర్ట్‌బ్రాడ్, బర్న్స్, జోస్‌బట్లర్(కీపర్), జాక్ క్రావ్లే, జో డెన్లీ, ఒడెన్లీ లీ పోప్, సిబ్లే, క్రిస్‌వోక్స్, మార్క్ వుడ్. రిజర్వ్ ప్లేయర్లు: జేమ్స్బ్రాకే, సామ్కరన్, బెన్ఫోక్స్, డాన్లారెన్స్, జాక్లీచ్, సకీబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, ఒలీ రాబిన్‌సన్, ఒలీస్టోన్.
