పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి

పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి

తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ టపాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఘటన సమయంలో ఏడుగురు మృతి చెందగా..ఆస్పత్రి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు చనిపోయారు.  మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం.

వెంబకొట్టై సమీపంలోని రాము దేవన్ పట్టీలోని ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి పక్కనున్న నాలుగు భవనాలు కుప్పకూలిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.