హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. 85 ప్యాకెట్లు స్వాధీనం

హైదరాబాద్ సిటీ: మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా తూంకుంటలో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు కలకలం రేపాయి. మేడ్చల్ జిల్లా   టాస్క్ ఫోర్స్ పోలీసులు 85 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నిందితున్ని అరెస్ట్ చేశారు. బీహారు దర్భంగా కు చెందిన ఉపేందర్  తూంకుంటలో అద్దెకు ఉంటూ తన పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నాడు. సమాచారం మేరకు పోలీసులు తనిఖీ లు చేశారు. 

వీటిని  బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 25 తీసుకువచ్చి తూంకుంటలో ఒక్కొక్క చాక్లెట్ ను రూ.10  చొప్పున  అమ్ముతున్నట్టు  ఎస్సై పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. వీటి ధర 40 వేలు ఉంటుందని, చాక్లెట్లను నిందితుడిని  పోలీసులకు అప్పగించారు.

1.3 కేజీల పాపీస్ట్రా, 1.2 కేజీల 

గంజాయి :  అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో గురుద్వారా సమీపంలో పాపీస్ట్రా  అమ్ముతున్నారనే  సమాచారం తో ఎస్ టీ ఎఫ్  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంజి రెడ్డి   మంగళవారం  సర్దార్ రోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను పట్టుకొని 1.3 కేజీల పాపీస్ట్రా ను స్వాధీనం చేసుకున్నారు.

పాపిస్ట్రా సరఫరా చేసిన  జస్వీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై  కేసు నమోదు చేశామని, అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు.  దీంతోపాటు నానక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాంగూడలో  మహ్మమద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలం  ఇంట్లో తనిఖీలు చేసి, 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.