న్యూఢిల్లీ: ఫారిన్లో స్థిరపడేందుకు హై నెట్వర్త్ఇండివిడువల్స్ (హెచ్ఎన్ఐలు) ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. దీని ప్రకారం 2022లో దాదాపు 8,000 మంది హెచ్ఎన్ఐలు భారతదేశాన్ని వదిలి విదేశాల్లో సెటిల్ అవుతారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంపద, పెట్టుబడి, వలసలపై స్టడీ చేసే హెన్లీ గ్లోబల్ సిటిజన్స్ రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో కఠినమైన పన్ను రూల్స్ ఉండటం కారణంగా, బలమైన పాస్‌పోర్ట్‌ల కావాలనే కోరిక వల్ల వలసలకు మొగ్గుచూపుతున్నారు. తక్కువ పన్నులు, ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉన్న దేశాలకు వెళ్తున్నారు. జీవన ప్రమాణాలు బాగుండటం, క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ వంటివి కూడా హెచ్‌ఎన్‌ఐలను ఫారిన్‌కు తీసుకెళ్తున్నాయి.
మెజారిటీ హెచ్ఎన్ఐల చూపు.. అటు వైపు
మెజారిటీ హెచ్ఎన్ఐలు యూరప్‌తోపాటు దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియావైపు చూస్తున్నారు. డిజిటల్ ఎంట్రప్రిన్యూర్లు సింపూర్వైపునకు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ లీగల్ సిస్టమ్ బాగుంటుంది. వరల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందుబాటులో ఉంటారు. చాలా ఇన్సెంటివ్స్ రావడం వల్ల దుబాయ్ గోల్డెన్ వీసాకు కూడా మంచి గిరాకీయే ఉంది. ఈ దేశానికి దాదాపు 2022లో నాలుగు వేల మంది హెచ్ఎన్ఐలు వెళ్తారని అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు 3,500 మందికి వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత ఎక్కువ మంది యువ ఎంట్రప్రిన్యూర్లు ఇంటర్నేషనల్ మార్కెట్లలో పెట్టుబడి అవకాశాల కోసం వెతుకుతున్నారు.
