- కర్ణాటకలోని చిక్ బల్లాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం
- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఆరుగురు స్పాట్ లో చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు సమాచారం. గాయపడిన మరో ఐదుగురిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రా సరిహద్దులోని చిక్ బళ్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘోర ప్రమాదం. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ.. వేగంగా జీపును ఢీకొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న వారంతా ఎగిరిపడ్డారు. తీవ్ర రక్తస్రావంత కావడంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కంచర్లహళ్లి పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.
