తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మొత్తం13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
ఏప్రిల్ 10వ తేదీ గురువారం రోజునశ్రీవారిని 65,570 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా ఈ నెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.