కర్ణాటకలో కొత్త కరోనా వైరస్ భయం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల యూకే నుంచి సుమారు 75మంది రాష్ట్రానికి వచ్చారని ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ తెలిపారు. అయితే ఇప్పుడు వారి తెలియకపోవడం రాష్ట్రప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది.
మరోవైపు యూరోపియన్ కంట్రీ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేయగా ఏడుగురికి కొత్త కరోనా వైరస్ సోకగా, మరో 31మంది రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ యూకే నుంచి వచ్చిన 75మందిని గుర్తించలేకపోయాం. వారి గురించి విచారణ ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో యూకే నుంచి వచ్చిన కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల వివరాల్ని సేకరించామన్నారు. అయితే అందులో యూకే పౌరసత్వం ఉండి, రాష్ట్రంలో వారి అడ్రస్ లు కరెక్ట్ గా లేవన్నారు.
అయితే 75మందిలో సుమారు 70మంది ప్రయాణికులు బృహత్ బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (బీబీఎంపీ) పరిధిలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే వారి ఆచూకీ గుర్తించి కరోనా టెస్ట్ లు చేస్తామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ తెలిపారు.
ప్రస్తుతం యూకే నుంచి 33 మంది ప్రయాణికులు వారితో కలిసిన 5 మందికి కరోనా సోకగా, వారికి సోకింది కొత్త వైరస్సా లేదా అనేదే నిర్ధారించాల్సి ఉందన్నారు.
తాజా సమాచారం ప్రకారం నవంబర్ 25 నుంచి 5,068మంది యూకే నుంచి కర్ణాటకకు వచ్చినట్లు తేలింది. అందులో 4,238 మంది డిసెంబర్9 నుంచి ఇప్పటి వరకు వచ్చారు. అయితే డిసెంబర్ 9 నుంచి వచ్చిన సుమారు 810 మంది కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు.
