45ఏళ్లు దాటిన మహిళలకు నాలుగు దఫాల్లో రూ.75వేలు

45ఏళ్లు దాటిన మహిళలకు నాలుగు దఫాల్లో రూ.75వేలు

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగబోతోందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలు తెలుసుకున్నానని..ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే తన కోరిక అన్నారు. నేను ఉన్నాననే భరోసా ప్రతి ఒక్కరికి ఇస్తున్నానని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా ఇస్తున్నా… రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరాలన్నారు. ఫీజులు కట్టలేక పిల్లలు బడులు మానేస్తున్నారన్న ఆయన… కడప స్టీల్ ప్లాంట్ ఇస్తే 10వేల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని… రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న సీఎం అయిన తర్వాత ఏడాదికి రూ.12,500 ఇస్తామని ప్రతి రైతన్నకు చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు. YSR చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన SC,ST,BC, మైనార్టీ మహిళలకు నాలుగు దఫాల్లో రూ.75వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉన్నా కూడా నేరుగా చెల్లిస్తామన్నారు. చంద్రబాబు మాటలకు మోసపోవద్దన్న జగన్ … బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే రుణాలిచ్చే రోజులు వస్తాయన్నారు.