కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో రైల్వేశాఖ మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా 75 శాతం రైళ్లను నడిపించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశంలో 1100 మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రైళ్లలో కూడా కేవలం రిజర్వేషన్ బోగీలను మాత్రమే నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత రైల్వే శాఖ పూర్తి స్థాయిలో రైళ్లను నడపడానికి అవసరరమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతమైతే రైళ్ల సంఖ్యను నెమ్మదినెమ్మదిగా పెంచుతోంది రైల్వే శాఖ.
