రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు 72 మంది ఎంపిక

చేగుంట, వెలుగు : స్కూల్​గేమ్స్ ఫెడరేషన్​ఆధ్వర్యంలో మంగళవారం చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14, 17, 19 బాల, బాలికల రగ్బీ పోటీల్లో మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 36 మంది బాలికలను, 36 మంది బాలురను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కోచ్ గణేశ్ రవికుమార్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రమేశ్, జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడు నాగరాజు, సెలక్షన్ కమిటీ ఇన్​చార్జి శారద తెలిపారు.

అండర్ 17 బాల, బాలికల రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 10 నుంచి 12 వరకు మేడ్చల్ జిల్లా కేఎల్ఆర్ క్రికెట్ గ్రౌండ్​లో జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరి, రగ్బీ రెఫరీలు నవీన్, మహేశ్, శ్రీనాథ్, పీఈటీ లు నరేశ్, ప్రవీణ్, శేఖర్, శంకర్, నర్సింలు, సరితా, మంజుల, ప్రభు, చింటు పాల్గొన్నారు.

 రాష్ట్ర స్థాయి పోటీలకు నాగపురి విద్యార్థిని

చేర్యాల : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్​ బాలికల అండర్ 17, 400 మీటర్ల పరుగు పోటీలకు మండలంలోని నాగపురి జడ్పీహెచ్ఎస్​ స్కూల్​లో 9 వ తరగతి చదువుతున్న ​కె. మౌనిక ఎంపికైనట్లు స్కూల్​ హెచ్​ఎం ఎలికట్టె ఐలయ్య తెలిపారు. ఇటీవల సిద్దిపేట ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్​ బాలికల అండర్​ 17, 400 మీటర్లు పరుగు పందెంలో పాల్గొన్న మౌనిక రెండో బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందన్నారు.