కోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

కోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా రోజు వారీ మరణాలు కూడా 300 లోపు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,15,397మందికి టెస్టులు చేయగా.. 20,021 కేసులు నమోదయ్యాయి.  279 మంది చనిపోయారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,07,871 కి చేరగా.. మరణాల సంఖ్య 1,47,901కి చేరింది. ఇంకా 2,77,301 మంది ఆస్పత్రిలో ఉన్నారు. నిన్న మరో 21,131 కోలుకోవడంతో  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 97,82,669 కి చేరింది.     India reports 20,021 new COVID-19 cases, 21,131 recoveries, and 279 deaths in last 24 hours, as per Union Health Ministry Total cases: 1,02,07,871 Active cases: 2,77,301 Total recoveries: 97,82,669 Death toll: 1,47,901 pic.twitter.com/4rp0O5MswG — ANI (@ANI) December 28, 2020